ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల ఫై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు , ఇతర పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలు కూడా బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని అరవింద్ పేర్కొన్నారు.

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. హాత్ సే హాత్ జోడోయాత్ర లో భాగంగా ప్రస్తుతం రేవంత్ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో డి శ్రీనివాస్ చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. డి ఎస్ చేరిక అధిష్టానం పరిధిలో ఉందన్నారు.. ఆయన ఇప్పటికే రెండు సార్లు సోనియాను కలిశారని.. కొత్త చేరికలు త్వరలో ఉంటాయని తెలిపారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు అపొద్దు అని రాహుల్ గాంధీ చెప్పారని వివరించారు. ఇక ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు.