ఈనెల 10 నుండి బండి సంజయ్ యాత్ర

తెలంగాణ లో మళ్లీ ఎన్నికల సమరం మొదలైంది. ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల హడావిడి పూర్తికాగా ..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అన్ని పార్టీ లు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ ఈ నెల 10 నుంచి యాత్ర చేపట్టబోతున్నారు.

విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో సంజయ్ యాత్ర చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగేంత వరకు ఆయన యాత్ర కొనసాగనుంది. 10వ తేదీన కొండగట్టు వద్ద పూజ చేసి, మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యాత్ర ముగుస్తుంది

ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా….కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.