దళితులకు దళితబంధు ఒక వరం

బీజేపీ నేతలకు నిజాలు చెప్పిన చరిత్ర లేదు: కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : బీజేపీ నేతలకు ఏనాడు నిజాలు చెప్పిన చరిత్ర లేదని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారికి నిజాలు చెప్పే అలవాటు లేదని విమర్శించారు. దేశంలో రూ. 2 వేల పెన్షన్ కూడా బీజేపీ ఇవ్వలేదని… అలాంటిది దళితులకు రూ. 50 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వందల ఏళ్లుగా దళితులు వెనుకబడి ఉన్నారని… వారికి దళితబంధు పథకం ఒక వరమని చెప్పారు.

కరీంనగర్ లో ఈరోజు రూ. 31.30 కోట్లతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ లకు కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/