మంత్రి అప్పలరాజుకు ఘోర పరాభావం

శారదాపీఠం వద్ద అడ్డుకున్న సీఐ

విశాఖ : విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి సీదిరి అప్పల్రాజు కు పరాభవం జరిగింది. దీంతో ఆయన లోనికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. ఇదే టైమ్‌లో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా ఉన్న సీదిరి అప్పల్రాజు కూడా ముందుగానే విశాఖ శారదాపీఠానికి చేరుకున్నారు. కానీ.. అనుచరులతో కలిసి లోనికి వెళ్తున్న మంత్రి అప్పల్రాజును ఆపేశారు అక్కడ ఉన్న ఓ సీఐ. మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లాలని, సెక్యూరిటీ కారణంగా అనుచరులను అనుమతించలేమని చెప్పేశారు. దీంతో మంత్రికి.. సీఐకి మధ్య వాగ్వాదం జరిగింది. పీఠం ఎంట్రెన్స్ దగ్గర మంత్రిని సీఐ దుర్భాషలాడారు.

ఆ వ్యాఖ్యలకు సీఐ క్షమాపణలు చెప్పాలని మంత్రి, అనుచరులు డిమాండ్ చేశారు. అప్పలరాజుపై సీఐ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి అనుచరుల నినాదాలు చేశారు. సీఐ మాత్రం సెక్యూరిటీనే ముఖ్యమని, క్షమాపణలు చెప్పనని అనడంతో.. అప్పల్రాజు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా అక్కడ ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు.. మంత్రిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ బాగా హర్టయిన మినిస్టర్.. కనీసం సీఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోవడంతో.. హోంమంత్రితో తేల్చుకుంటామని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా సీఎం జగన్‌ పర్యటన దృష్ట్యా పోలీసుల శారదాపీఠం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/