కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

బాక్స్ ఆఫీస్ వద్ద కార్తికేయ 2 మొదటిరోజు వసూళ్ల వర్షం కురిపించింది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ నిన్న (ఆగస్టు 13) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు. దీంతో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు.

ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్‌ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్‌, రూ.5.05 కోట్ల షేర్‌ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్‌, రూ.3.50 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ.1.24 కోట్లు

సీడెడ్ -రూ.40 లక్షలు

ఈస్ట్ – రూ.33 లక్షలు

వెస్ట్ – రూ.20 లక్షలు

ఉత్త‌రాంధ్ర – రూ.45లక్షలు

గుంటూరు- రూ.44 లక్షలు

కృష్ణా – రూ.27 లక్షలు

నెల్లూరు – రూ.17 లక్షలు

మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్‌) సాధించింది.