‘ఇంకో 4 నెలలు రాకుండా ఉంటే నిండుగా వర్షాలు’
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కామెంట్స్

Amaravati: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారని అన్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలాగే ఈ ఏడూ కూడా జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని విజయసాయి ట్వీట్ చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/