గువాహటిలో స్వల్ప భూకంపం

earthquake

గువాహటి: అస్సాం రాజధాని గువాహటిలో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 5.42 గంటలకు గువాహటిలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. గువాహటికి 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. తెల్లవారుజామున భూమి కంపించండంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు పేర్కొన్నారు.