టీష‌ర్ట్స్‌, జీన్స్ వంటివి నిషేధం: సీబీఐ ఆదేశాలు

దేశ‌వ్యాప్తంగా సీబీఐ శాఖ‌ల హెడ్స్ క‌చ్చితంగా పాటించాల్సిందే..

cbi-T-shirts, jeans banned
cbi-T-shirts, jeans banned

New Delhi: ఇకపై జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూస్ వంటిని సీబీఐ అధికారులు ధరించకూడదని, హుందాగా ఫార్మ‌ల్ దుస్తులనే ధరించాలని ఆదేశాలు వెలువడ్డాయి. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) నూతన డైరెక్ట‌ర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ త‌న అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దేశ‌వ్యాప్తంగా సీబీఐ శాఖ‌ల హెడ్స్ క‌చ్చితంగా ఈ ఆదేశాలు అమ‌లయ్యేలా చూడాల‌ని తేల్చి చెప్పారు. కాగా ఈ ఆదేశాలు ఒక‌ర‌కంగా మంచివేన‌ని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/