బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన దీప్తి సునయన..ఏంట్రా ఇది

బిగ్ బాస్ 5 సీజన్ సక్సెస్ ఫుల్ సాగుతుంది. హౌస్ లో టాస్క్ లు , గొడవలు , డాన్సులు , ఫైట్ లు ఇలా ఏది తక్కువ కాదు అన్నట్లు నడుస్తుంది. ఈరోజు షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భాంగా బిగ్ బాస్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి షణ్ముఖ్ ను ఆనందంలో పడేసాడు.

షణ్ముఖ్ జశ్వంత్ – దీప్తి సునయన మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా ఆయన లవర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఓ వీడియో ద్వారా అందరిముందే ఆమెతో ఐ లవ్ యూ చెప్పించి అతన్ని ఫిదా చేసేసింది. ”హలో షన్ను.. ఐ లవ్ యూ” అంటూ దీప్తి చెప్పడంతో షణ్ముఖ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ బయట తన స్నేహితులతో కలిసి టపాసులు కాలుస్తూ దీప్తి ఎంజాయ్ చేసినట్లు వీడియోలో చూపించారు. మరోవైపు తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ పెట్టిన దీప్తి.. షణ్ముఖ్‌పై ఉన్న ప్రేమను బయటపెడుతూ అతనితో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రోమో ఎపిసోడ్ ఫై ఆసక్తి పెంచుతుంది.

#Shanmukh gets a pleasant birthday surprise .. Happy Birthday Shanmukh 🎂 🎊 🎉 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/mRAYDoiSkk— starmaa (@StarMaa) September 16, 2021