రెండో రోజు ప్రారంభమైన బండి సంజయ్ యాత్ర

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిన్న మంగళవారం మొదలుపెట్టారు. ఈ సందర్బంగా యాదాద్రి జిల్లా వంగపల్లిలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ ఏర్పటు చేసారు. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. అలాగే కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డి , హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. సంజయ్ యాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు.

ఈరోజు సంజయ్ రెండో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. 2 వ రోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ నిర్వహించనున్నారు బండి సంజయ్. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. రేపు గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగు తండా, చిన్న రావుల్పల్లి, గుర్రాలదండిలో 11.7కి.మీ. మేర యాత్ర ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోకి పాదయాత్ర మొదలు అవుతుంది. మొత్తం 24 రోజుల ఈ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో 328 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.