ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్
ఈరోజు రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ
AP CM YS Jagan Mohan Reddy
అమరావతి: ఏపీ సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ కానున్నారు. అంతకుముందే జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసి చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జగన్ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ వెంట వైస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/