బాలయ్య కు ఎలాంటి సర్జరీ జరగలేదు..

సోషల్ మీడియా లో బాలకృష్ణ మోకాలికి చిన్న సర్జరీ జరిగినట్లు ఉదయం నుండి ఓ వార్త..పిక్ వైరల్ గా మారడం తో అభిమానులంతా నిజమే అనుకోని అయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని ప్రముఖ PRO టీం తెలిపింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు. అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. అలాగే ఆగస్టు లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నారు.