ఆహారం పాడవకుండా ఉండాలంటే..!

మహిళలకు వంటింటి చిట్కాలు

Storing food without spoiling
Storing food without spoiling

ఎండలు పెరుగుతున్నాయి, ఈ వేడికి ఆహారం పాడవటం ఈ కాలంలో పెద్ద సమస్య.. దీన్ని ఎలా అధిగమించాలో చూద్దాం.
వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. వంటకాల్లో దీనికి ప్రాధాన్యం ఇవ్వండి.. ఆహారం త్వరగా పాడవకుండా, ఎక్కువ సేపు నిల్వ ఉండేలా కాపాడుతుంది.. ఇది కడుపులోని బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములతోనూ పోరాడగలడు..

రుచికి ఉప్పు తప్పనిసరి.. ఈ కాలంలో మాత్రం పింక్ లేదా హిమాలయన్ సాల్ట్ ను వంటల్లో వాడండి.. ఇవి సహజ నిల్వ పదార్ధాలుగా పనిచేస్తాయి..
సిట్రిక్ ఆసిడ్ కూడా సహజ నిల్వ పదార్ధమే . ఇది నిమ్మ ద్వారా పుష్కలంగా లభిస్తుంది..

చల్లనైన, ఉడికించినవైనా కొద్దిగా నిమ్మ రసాన్ని కలపండి.. ఆహారం పాడవకుండా చూస్తుంది… లేదా కాస్త వెనిగార్ ను కలపండి.. ఐడి ఆహారాన్ని కుళ్లించే స్మూక్షన్ జీవులను చంపటమే కాకుండా రుచిని పెంచటంలోనూ సాయపడుతుంది..

‘స్వస్థ’ (ఆరోగ్య సంబంధిత ) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/