నర్సులకు క్షమాపణలను తెలిపిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ నర్సులకు క్షమాపణలను తెలిపారు. అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో నర్సుల‌పై చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్య ఫేస్‌బుక్‌ పోస్టులో ‘అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం’అన్నారు.

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా వీరసింహ రెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని ఫై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపగా..ఇప్పుడిప్పుడే ఆ వివాదాన్ని అంత మరచిపోతుండగా..తాజాగా బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్. ఇందులో నర్సుల‌పై బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఏపీ న‌ర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌చ్చంద ప్ర‌సాద్ తెలిపారు. ఇదే సంద‌ర్భంలో బాల‌కృష్ణ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లో ప్ర‌సారమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌లో త‌నకు యాక్సిడెంట్ జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వివ‌రిస్తున్న సందర్భంలో న‌ర్సు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని న‌ర్సుల సంఘం డిమాండ్ చేసింది. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని న‌ర్సులు హెచ్చరించారు.

దీంతో బాల‌కృష్ణ నర్సులకు క్షమాపణలు తెలిపారు. అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో నర్సుల‌పై చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్య ఫేస్‌బుక్‌ పోస్టులో ‘అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం’అన్నారు. ‘బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ’ అంటూ స్పందించారు.