ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలకృష్ణ

నేడు ఎన్టీఆర్ జయంతి..ఎన్టీఆర్ ఘాట్ కు పలువురు ప్రముఖులు

Nandamuri Balakrishna Pays Tribute To NTR on His Birth Anniversary

హైదరాబాద్‌: నేడు దివంగత ఎన్టీఆర్‌ జయంతి ఈ సందర్భంగా నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణతో పాటు రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. మరోవైపు పలు ప్రాంతాల్లో టిడిపి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/