రికార్డులు క్రియేట్ చేస్తున్న అఖండ టీజర్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘అఖండ’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ వంటి చిత్రాలు రాగా అవి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేశాయి.

దీంతో అఖండ చిత్రం వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను ఓ చిన్న టీజర్‌తో రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బాలయ్య సరికొత్త గెటప్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్‌కు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. దీంతో ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్ 30 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేయడంతో సీనియర్ హీరోల్లో బాలయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

ఈ టీజర్‌కు ఇంత ఆదరణ లభించడంతో, ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పూర్ణా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.