పడకగదిలో ఆ మూడే ఇష్టమంటున్న స్టార్ బ్యూటీ

స్టార్ హీరోయిన్లు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో ఎక్కువగా షేర్ చేసుకునేందుకు ఇష్టపడరు. కానీ బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ బ్యూటీ ఏకంగా తన బెడ్ రూం సీక్రెట్స్‌ను ప్రేక్షకులతో పంచుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో ఎంతో అన్యోన్యంగా సంసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ స్టార్ కపుల్‌కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ నిర్వహించిన ఓ టాక్ షోలో తన బెడ్ రూంకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బట్టబయలు చేసింది. కరీనాకు తన బెడ్ రూంలో ఏ మూడు విషయాలు అంటే చాలా ఇష్టమని కరణ్ అడగ్గా.. తనకు బెడ్ రూంలో అడుగుపెట్టకముందు ఓ వైన్ బాటిల్, పైజామా, సైఫ్ అలీ ఖాన్ ఈ మూడు విషయాలు తనకు చాలా నచ్చుతాయని చెప్పుకొచ్చింది.

తమ కాపురం చాలా సంతోషంగా ఉండటానికి కారణం పరస్పరం ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడమే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి బెబో తన బెడ్ రూం సీక్రెట్‌ను కూడా ప్రేక్షకులతో పంచుకోవడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.