వకీల్ సాబ్‌లో పవన్ ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా?

వకీల్ సాబ్‌లో పవన్ ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఆయన్ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.

కాగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో వకీల్ సాబ్ రికార్డలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో పవన్ స్క్రీన్ ప్రెసెన్స్ గురించి సినీ వర్గల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కేవలం 50 నిమిషాల నిడివితో మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది. దాదాపు రెండు గంటలకు పైగా ఉన్న సినిమాలు పవన్ కేవలం 50 నిమిషాలు కనిపించడం ఏమిటని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరో స్క్రీన్ ప్రెసెన్స్ కంటే కూడా కథే ముఖ్యమని చిత్ర యూనిట్ అంటోంది. అందుకే పవన్ స్క్రీన్ ప్రెసెన్స్‌ కంటే కూడా వారు కథకే ప్రాధాన్యత ఇచ్చారిన చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని, ప్రేక్షకులు పవన్‌ను చూసి ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారని చిత్ర యూనిట్ అంటోంది. మరి వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఇంప్రెస్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.