ఓటీటీ అంటేనే వణికిపోతున్న హీరో

ఓటీటీ అంటేనే వణికిపోతున్న హీరో

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ, వాటిని సక్సెస్‌లుగా మలుచుకుంటూ దూసుకుపోతున్న నానికి గతకొంత కాలంగా సరైన హిట్ పడలేదు. నాని నటించిన లాస్ట్ మూవీ ‘వి’ కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నా, ఓటీటీ రిలీజ్ కావడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో తన నెక్ట్స్ చిత్రాలను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే నాని నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’ను వేసవి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం, ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడుకునేందుకు పలు ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుండటంతో, సినిమా రంగానికి చెందిన థియేటర్లను కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మూసివేశారు.

దీంతో టక్ జగదీష్ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోమని నాని ఇటీవల ప్రకటించాడు. దీంతో ఓటీటీ రిలీజ్ అంటే నాని భయపడుతున్నాడనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్కడ రిలీజ్ అయినా నెగ్గుకువస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి నాని ‘టక్ జగదీష్’ చిత్రంలో నిజంగా అంత మ్యాటర్ లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.