అఖిల్ బర్త్ డే సందర్బంగా ఏజెంట్ నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్

ఏప్రిల్ 08 న అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్బంగా ఏజెంట్ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో అఖిల్ గన్ పట్టుకుని నిలిబడినట్లు కనిపించాడు. టాలీవుడ్ లో మహేష్ తర్వాత హాలీవుడ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్న హీరో అఖిలే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వేస్తున్నారు.

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ , సాంగ్ ఇలా అన్ని కూడా సినిమా ఫై ఆసక్తి నింపాయి. ఏప్రిల్ 28న ఈ మూవీ ని విడుదల చేయనున్నట్టుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మళయాలం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రానుంది. వక్కంతం వంశీ స్ర్కీన్ ప్లేను అందించనున్నాడు. అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది.