చివరి నిమిషంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ రద్దయింది

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణ కు రాబోతున్నారని , బిజెపి నేతలు ఆయా ఏర్పాట్లు పూర్తి చేసారు. కానీ చివరి నిమిషంలో నడ్డా పర్యటన రద్దయింది. సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును నడ్డా రేపు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ఇక దేశ రాజకీయాలలో బిజెపి కీలకంగా వ్యవహరిస్తూ వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మూడవసారి కూడా అధికారంలోకి రావడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ పాగా వేయడానికి తగిన ప్లాన్ లను రెడీ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే బీజేపీ లక్ష్యంగా మారింది. అందుకే బిజెపి అగ్ర నేతలు వరుసగా తెలంగాణ లో పర్యటిస్తూ..నేతలకు పలు సూచనలు , సలహాలు ఇస్తూ ..బిఆర్ఎస్ ను ఎదుర్కునే సమీకరణాలు జారీ చేస్తూ వస్తున్నారు. కాగా ఏప్రిల్ 8న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ రానున్న విషయం తెలిసిందే.