రఘురామకు బెయిల్ మంజూరు

బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం

Bail granted to MP Raghurama
Bail granted to MP Raghurama

New Delhi: నరసాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, రూ. లక్ష షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.

బెయిల్ కండీషన్స్:

  • దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి.
  • న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి.
  • ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు.
  • దర్యాప్తును ప్రభావితం చేయకూడదు.
  • మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.
  • గతంలో చూపించినట్లు తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదు
  • నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/