బహ్రెయిన్‌ ప్రధాని కన్నుమూత

bahrains-long-serving-pm-khalifa-bin-salman-al-khalifa-dies

దుబాయి: బహ్రెయిన్‌ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా(84) కన్నుమూశారు. ఇటీవల అనార్యోగానికి గురైన ఖలీఫా అమెరికాలోని మయో క్లినిక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆ దేశ అధికారి మీడియ వెల్లడించింది. ఖ‌లీఫా పార్దీవ‌దేహం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మీడియా వెల్ల‌డించింది. వారం రోజుల పాటు ఆ దేశంలో సంతాప దినాలు ప్ర‌క‌టించారు. 1970 నుంచి బెహ్రాయిన్ ప్ర‌ధానిగా షేక్ ఖ‌లీఫా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. 1971, ఆగ‌స్టు 15వ తేదీన ఆ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింది. ప్ర‌పంచంలో అత్యంత సుదీర్ఘ‌కాలం ప్ర‌ధానిగా చేసిన రికార్డును బిన్ స‌ల్మాన్ ఖ‌లీఫా సొంతం చేసుకున్నారు. 2011లో వ‌చ్చిన అర‌బ్ విప్ల‌వంలోనూ ఆయ‌న త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకోగ‌లిగారు.


తాజా వీడయోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/