నేటి నుంచి బద్రీనాథ్ ఆలయం మూసివేత

న్యూఢిల్లీః శీతాకాలాన్ని పురష్కరించుకొని ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. ఈసందర్భంగా బద్రీనాథ్ ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 15 క్వింటాళ్ల బంతి పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 3.33 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు తెలిపింది. శీతాకాలం లో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.