మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి జరిమానా:ఎన్జీటీ
national green tribunal
నాసిక్: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి జరిమానా విధించింది. జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్ధాలను నదిలో కలవకుండా చూడాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక ప్రభుత్వం విస్మరించింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి జరిమానా వేసింది. మున్సిపల్ వ్యర్ధాలను నదిలో కలవకుండా ప్రభుత్వం అడ్డుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి జరిమానా విధించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/