ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటాకు ప్రమాదం

kento momota injured in road accident
kento momota injured in road accident

కౌలాలంపూర్: ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు కెంటో మొమోటా మలేషియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన కొన్ని గంటల్లోనే అతడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. కెంటో మొమోటాతో పాటు మరో ముగ్గురు కౌలలాంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా వీరంతా ప్రయాణిస్తున్న వ్యాన్‌ 30 టన్నుల బరువుతో నిదానంగా వెళ్తున్న లారీని వెనకు నుంచి అమాంతం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించగా… కెంటోతో పాటు ఉన్న అతడి అసిస్టెంట్‌ కోచ్‌ మోరిమోటో ఆర్కిఫుకి., ఫిజియోథెరపిస్ట్‌ హిరాయమా యు, బ్రిటిష్ బ్యాడ్మింటన్ టెక్నికల్ ఆఫీసర్ ఫోస్టర్ విలియం థామస్ తీవ్ర గాయాలయ్యాయి. ఇక కెంటో మొమోటా ముక్కు పగలడంతో పాటు అతడి ముఖానికి గాయమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పుత్రజయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/