దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరిగేనా?

Dharamshala stadium
Dharamshala stadium

ధర్మశాల: న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా, తాజాగా మరోపోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి మారనుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రస్తుతం మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక గురువారం కూడా 90 శాతం వర్షం కురిసే అవకాశముందని సమాచారం అందింది. దీంతో మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే తొలి వన్డేకు మరో భయం పట్టుకుంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో టికెట్ల కొనుగోలు విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు రావడంలేదు! మరోవైపు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే అభిమానులు కరోనా దెబ్బకు భయపడి పోతున్నారు. ఇప్పటి వరకు కూడా టికెట్లు పూర్తి స్థాయి అమ్ముడు పోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక చేయండి:https://www.vaartha.com/telangana/