జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటి

Pawan -JP Nadda
Pawan -JP Nadda

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా రాజధాని పర్యటలో ఉన్నారు. ఈసందర్భంగా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో ఆయన నివాసంలో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు వినాయక ప్రతిమను పవన్ బహుకరించారు. ఈ భేటీలో పవన్ వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి పెద్దల్ని కలవక ముందు పవన్ పలువురు ఆర్ఎస్ఎస నేతల్ని కూడా కలిసినట్లు వార్తలు వినిపించాయి. వారితో పవన్ రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా ఇవాళే కాకినాడకు వెళ్లనున్నారు.

జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/