పవన్ కళ్యాణ్ ను కలిసిన మచిలీపట్నం మాజీ ఎంపీ

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యముగా జనసేన పార్టీ దూకుడు బాగా పెంచింది. గతంలో కంటే ప్రజలు సైతం జనసేన పార్టీ కి జై అంటున్నారు. చంద్రబాబు, జగన పాలనా చూసిన ఏపీ ప్రజలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు అనేక సర్వేలు చెపుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ నేతలు జనసేన పార్టీ లోకి వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం చేరికల ఫై చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉంటె శనివారం విజయవాడ కు వచ్చిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పవన్‌ను కలిశారు. ఇద్దరు ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో బాడిగ జనసేన పార్టీలో చేరతారా అన్న చర్చ మొదలైంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా.. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బాడిగ రామకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన పవన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.