చిరు ఇంటికి వచ్చిన సల్మాన్ , కమల్

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇద్దరు స్టార్స్ అతిధులుగా వచ్చి సందడి చేసారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్..తాజాగా విక్రమ్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఖైదీ , మాస్టర్ చిత్రాల ఫేమ్ లోకేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా , కమల్ నిర్మించారు. గత వారం పలు భాషల్లో పాన్ ఇండియా గా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడమే కాక , భారీ వసూళ్లు రాబడుతుంది.

ఈ క్రమంలో శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కమల్ హాసన్ వచ్చారు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కమల్ హాసన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా రావడంతో ఆయనను కూడా ప్రత్యేకంగా గౌరవించారు.

నా ప్రియమైన పాత మిత్రుడు నిన్న రాత్రి నా ఇంటికి వచ్చారు. విక్రమ్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నా మిత్రుడికి అభినందనలు అతనికి సంపూర్ణ ఆనందం కలగాలని వేడుకలు సన్మానాలు కలగాలని కోరుకుంటున్నాను.. ఇది ఎంత గాఢమైన, ఉత్కంఠభరితమైన చిత్రం. మరింత శక్తి కలగాలని కూడా కోరుకుంటున్నట్లు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అసలైన పాన్ ఇండియా ఫ్రేమ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ ఇలా ముగ్గురు అగ్ర హీరోలు కూడా ఒకే ఫ్రేమ్లో దర్శనమివ్వడంతో ఇరు వర్గాల అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ అందుకున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం లో విఫలమైంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ , భోళా శంకర్ మూవీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022