ఏపి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెల్లడి

Congress

అమరావతిః లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌ 114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

.కడప లోక్‌సభ బరిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
.కాకినాడ – పల్లంరాజు, రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
.కర్నూలు-రాంపుల్లయ్య యాదవ్‌, బాపట్ల – జేడీ శీలం
.చింతలపూడి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ఎలీజా
.ఇటీవల వైకాపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎలీజా
.నందికొట్కూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆర్థర్‌
.ఇటీవల వైకాపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆర్థర్‌

పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచారు.  ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…