ఒత్తిడికి దూరంగా..

ఇష్టమైన పనులు చేయడంతో డిప్రెషన్‌ నుండి బయటపడవచ్చు

Away from stress
Away from stress

కొందరిలో శ్రమ ఎక్కువవడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసిక స్థిమితం లేకుండా చేయడం, ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోతున్నట్టు , దీనికి తోడు ఆత్మన్యూనతాభావం, శారీరక సమస్యలు మరింత దిగజార్చుతాయి. ఇలాంటి పరిస్థితిని ఒత్తిడి అనవచ్చు.

కొన్ని రకాల లక్షణాలను అంచనా వేసి వాటీ తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను గుర్తించవచ్చు.అలాగే డిప్రెషన్‌ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.

నీరసం, చికాకు, నిరాశ, అభద్రతాభావం, అంతా శూనయమైపోతున్నట్లుగా అనిపించడం, తప్పు చేస్తున్నట్లు మనసుకు అనిపిస్తుండటం, ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి లోపం, చెడు జరుగుతుందేమోనన్న భయానికి గురి కావడం, ఇష్టపడుతున్న వాటిని అంతగా పట్టించుకోకపోవడం వంటి మానసికపరమైన అంశాలు డిప్రెషన్‌కు లక్షణాలుగాచెప్పవచ్చు.

stress

డిప్రెన్‌కు గురయినప్పుడు మానసికంగానే కాదు శరీర అవయవాల్లోను మార్పులు జరిగి శారీరక సమస్యలకు కూడా కారణం కావచ్చు.

తలనొప్పి, తలతిరడం, అతిగా తినడం, తిండిమానేయడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలకు కొన్ని సూచనలు పాటించాలి.

మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, బాధ కలిగించే విషయాల నుంచి మనసు మళ్లించే ప్రయత్నం చేయడం, చిన్న విషయాల గురించి అనవసర ఆందోళన వదిలేయాలి.

ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలి.

బ్రీథింగ్‌ వ్యాయామాలు చేయడం,తరచూ పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపడం, ఇష్టమైన పనులు చేయడం వంటి చేస్తే దాదాపు డిప్రెషన్‌ నుండి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/