తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్ దాఖలు

ఆడియో, వీడియో రికార్డింగ్ లు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్

avinash-reddy-files-interim-petition-in-telangana-high-court

హైదరాబాద్ః మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.