”18 పేజెస్” గ్లింప్స్ రిలీజ్

ఓ హిట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న స్టార్స్ నిఖిల్ , అనుపమ. వీరిద్దరూ నటించిన చిత్రం ”18 పేజెస్”. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా బ్రేక్ పడుతూ వస్తూ ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సందర్బంగా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసారు చిత్ర మేకర్స్.

నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు’ అంటూ వీడియో ప్రారంభమైంది. సిద్ధు పాత్రలో నిఖిల్ నటించగా.. కవితలు రాసే యువతి నందినిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ వీడియో సినిమా ఫై ఆసక్తి పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు.

YouTube video