బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి

Avinash Reddy approached the Supreme Court for bail

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అవినాష్‌ లాయర్లు ఈ పిటిషన్‌ను మెన్షన్‌ చేయనున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననేది ఉత్కంఠగా మారింది.

కాగా, బెయిల్ కోసం ఈరోజు అవినాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ను మెన్షన్ చేయనున్నారు. అయితే బెయిల్ పిటిషన్‌పై జూన్ 5వరకు విచారణను వినలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కావాలంటే వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కానీ వెకేషన్ బెంచ్‌కు వెళ్లకుండా ఎంపీ అవినాశ్ రెడ్డి నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చారు. మొదటి ప్రాధాన్యతగా తనకు బెయిల్ ఇవ్వాలని… లేని పక్షంలో వెకేషన్‌ బెంచ్ అయినా తన బెయిల్ పిటిషన్‌ను వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. అయితే అవినాశ్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.