భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష ఎన్నిక

PT Usha Elected As President Of Indian Olympic Association

న్యూఢిల్లీః భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ ) అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు అభినందనలు తెలిపారు. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసింది. అయితే మరెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవిని అధిరోహించనున్న మొదటి మహిళగా రికార్టు సృష్టించారు. 58 ఏళ్ల ఉష తన కెరీర్‌లో ఒక క్రీడా సంస్థకు అధ్యక్షురాలిగా సేవలు అందించడం ఇదే తొలిసారి కావడం.

కాగా, కేరళకు చెందిన పీటీ ఉష తన 25 ఏళ్ల కెరీర్ లో 25 పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో మొత్తంగా 102 పతకాలను గెలుచుకుంది. క్రీడా రంగంలోఆమె చేసిన కృషికి గాను బిజెపి ఆమెను 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/