మరోసారి బోయపాటి – బాలయ్య కాంబో..

బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబో లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో మరోసారి వీరిద్దరి కాంబో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు మరోసారి వీరిద్దరూ జత కలవబోతున్నట్లు తెలుస్తుంది.

బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహా. అంతకుముందు వరకు కూడా బాలయ్య చాలా కాలం పాటు అపజయాలతో సతమతమవుతూ వచ్చాడు. ఆ టైం లో సింహా తో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసేశారు. ఇక మళ్ళీ లెజెండ్ సినిమాతో ఒక్కటైన ఈ కాంబో అంతకుమించి అనేలా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. మూడవసారి ఈ కాంబినేషన్ కలిసేందుకు చాలా ఎక్కువ సమయం పట్టింది. వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండ గత వారం విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించగా ఒక పాత్రలో రైతుగా మరో పాత్రలో అఘోరాగా నటించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ, శ్రీకాంత్, నితిన్ మెహ్రా, సుబ్బారావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందని తెలుస్తుంది.

హారిక హసినీ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో చర్చలు జరుపుతున్నారట. నాగవంశీ ముందు నుంచి బోయపాటితో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తారో చూడాలి.