జూన్ 07 నుండి ఓటీటీలోకి అవతార్‌ 2

ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ గతంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘అవతార్ 2’ మూవీ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 7వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ కానుంది.

గతేడాది డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంబాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 160 భాషలలో విడుదలైన ఈ సినిమా పుల్‌ రన్‌ల రెండు బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి పార్ట్‌లో పండోరా గ్రహం అందచందాలను చూపించిన కామెరూన్‌ రెండో భాగంలో సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు తెలియజేశారు. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన అవతార్‌ 2 ఇప్పుడు ఓటిటి లోకి రాబోతుండడం తో సినీ ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు.