అనంతపురంలో భారీ వర్షాల ఫై సీఎం జగన్ సమీక్ష

అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేహ్ కాదు బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని సూచించారు. భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురం సిటీని వరద ముంచెత్తింది. నడిమి వంకకు వచ్చిన వ‌ర‌ద‌ల‌ వల్ల సుమారు 15 కాలనీలు మునిగిపోయాయి. వేలాదిమంది కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వ‌చ్చారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ భారీ వర్షాల ఫై సమీక్ష చేశారు.

సహాయక చర్యలు, బాధితులను ఆదుకునే కార్యక్రమాల గురించి అధికారులు జగన్ కు వివరించారు. అనంతపురంలో హఠాత్తుగా కుండపోత, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలు తెలిపారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులకు ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని సీఎం ఆదేశించారు.