న్యూడ్ వీడియో కాల్ పై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్

ఇది మార్ఫింగ్ వీడియో అన్న మాధవ్

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ స్పందిస్తూ… ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. ఈ వీడియో తొలుత ఏబీఎన్ లో ప్రసారమయిందని చెప్పారు.

దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/