ఆచార్య ప్రీ రిలీజ్ సందర్భాంగా యూసఫ్ గూడ లో ట్రాఫిక్ ఆంక్షలు

చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లలో భాగంగా ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ క్రమంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తామని తెలిపారు. మైత్రీవనం నుంచి వచ్చేవాహనాలను యూసుఫ్‎గూడ చెక్‌పోస్ట్‌ వైపునకు అనుమతించరు. సవేరా ఫంక్షన్‌ హాల్‌ నుంచి కృష్ణకాంత్‌ పార్క్‌, కళ్యాణ్‌నగర్‌ వైపు, సత్యసాయి నిగమాగమం, కమలాపురి వైపు పంపుతారు. జూబ్లీహిల్స్‌ నుంచి అమీర్‌పేట వైపునకు వచ్చే వాహనాలను శ్రీనగర్‌ కాలనీ నుంచి సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మెగా మూవీ ఆచార్య. రీసెంట్ గా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 34 నిమిషాలుగా ఫైనల్ చేసారు. ఇక ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.