ఆ అణు జలాంతర్గాములను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం

వెల్లింగ్టన్‌: అణు జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా అర్‌డెర్న్‌ అన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అణు జలాంతర్గాములను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ న్యూజీలాండ్‌ పీఎం జసిండాకు తెలిపారు.

అయితే తమ పరిధిలోని పసిఫిక్‌ మహాసముద్రంలో అణు జలాంతర్గాముల ప్రయాణంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తామని, ఇది ఆస్ట్రేలియాకు వర్తిస్తుందని జసిండా స్పష్టం చేశారు. భద్రత, నిఘాకు సంబంధించి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్‌ దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనిని Five Eyes అని పిలుస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల కెనడాతో సహా ఆ మూడు దేశాలతో ఉన్న సంబంధాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదని ఆమె చెప్పారు.
కాగా, పసిఫిక్‌ మహాసముద్రంలో ఫ్రాన్స్‌ అణు పరీక్షల నేపథ్యంలో 1985లో న్యూజీలాండ్‌ ఈ నిషేధం విధించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/