భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రధాని

PM Shri Narendra Modi’s opening remarks at India Uzbekistan Virtual Summit.

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ఉజ్బెకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ షవకత్‌ మిర్జియోయెవ్‌తో ఈరోజు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ సంపూర్ణంగా ఆ దేశ నాయకత్వం, యాజమాన్యం, నియంత్రణలో జరగాలని చెప్పారు. గడచిన రెండు దశాబ్లాల్లో సాధించిన విజయాలను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత దేశం, ఉజ్బెకిస్థాన్ దృఢంగా నిలుస్తున్నట్లు మోడి చెప్పారు. ఈ రెండు దేశాలకు అతివాదం, ఛాందసవాదం, వేర్పాటువాదాలపై ఒకే విధమైన ఆందోళన ఉందన్నారు. ప్రాంతీయ భద్రత సమస్యలపై కూడా ఒకేవిధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ పూర్తిగా ఆ దేశ నాయకత్వంలో జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ఆఫ్ఘనిస్థాన్ సొంతంగా నిర్వహించాలని, నియంత్రించాలని ఆకాంక్షించారు. గడచిన రెండు దశాబ్దాల్లో సాధించిన విజయాలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకున్న నేపథ్యంలో మోడి ఈ వ్యాఖ్యలు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/