ఢిల్లీలోని అపోలో సిబ్బంది పై మృతురాలి బంధువుల దాడి

కరోనా మహిళ మృతిచెందడంతో ఆగ్రహం

Attack on Apollo crew in Delhi
Attack on Apollo crew in Delhi

New Delhi: ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిపై మృతురాలి బంధువులు దాడికి పాల్పడ్డారు ఆసుపత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళా రోగి మరణించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు వచ్చి ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలోకి కర్రలతో చితకబాదారు. అంతేకాదు ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కరోనా కష్ట కాలంలో ఎంతో శ్రమిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చారని , వెంటనే ఆమెకు చికిత్స అందించామని, ఐసీయూలో బెడ్స్ కొరతతో ఆలస్యమైందన్నారు. ఇంతలోనే ఆమె మృతి చెందిందని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/