అంగ్‌సాన్ సూకీ నిర్బంధం పొడగింపు
AUNGSAN SUKI
యాంగాన్: మయన్మార్‌లో మిలిటరీ పాలకులు అంగ్‌సాన్ సూకీ నిర్బంధాన్ని మరింత పొడిగించారు. ముందుగా విధించిన నిర్బంధం ప్రకారం ఆమె సోమవారం విడుదల కావాల్సి ఉండగా.. నిర్బంధాన్ని బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు మిలిటరీ ప్రభుత్వ నేతలు వెల్లడించారు. ఒకవైపు తమ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని తక్షణమే విడిచిపెట్టాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు మిలిటరీ పాలకులు మాత్రం ఆమె నిర్బంధాన్ని పొడిగించడం చర్చనీయాంశమైంది. మిలిటరీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా దేశంలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సూకీ నిర్బంధం కారణంగా మయన్మార్‌లో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మిలిటరీ పాలకులు ఇంటర్నెట్‌పై నిషేధం విధించినా మయన్మార్‌లో అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/