అపోలో-బజాజ్‌ భాగస్వామ్యం

వైద్యా సేవల కోసం రూ. 4లక్షల వరకు రుణం

apollo-hospitals-group-and-bajaj-finserv-have-made-partnership
apollo-hospitals-group-and-bajaj-finserv-have-made-partnership

హైదరాబాద్‌: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఆర్థిక సేవల సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి అపోలో హస్పిటల్స్‌ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ హెల్త్‌ కార్డు ఈఎంఐని ప్రవేశపెట్టాయి. వైద్య సేవలకు అయిన వ్యయాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఆసుపత్రిలో ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 12 నెలల్లో ఈ మొత్తాన్ని బజాజ్‌ ఫిన్‌సర్వ్‌్‌కు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుకు పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీతో పాటు డిస్కౌంట్‌ వోచర్స్‌ కూపన్స్‌ ఆఫర్‌ చేస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పాన్‌కార్డు ఆధార్‌ కార్డు క్యాన్సల్డ్‌ చెక్కు సమర్పించి ఈ కార్డు పొందవచ్చు. ఒప్పందం నేపథ్యంలో అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లను బజాజ్‌ ఫిన్‌కార్డు ఏర్పాటు చేయనుంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి ఎండీ సునీతా రెడ్డి బజాజ్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌ జైన్‌ ఇరు సంస్థల ప్రతినిధులు ఈ కార్డును ఆవిష్కరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/