అసోంలో క‌రోనా ఆంక్ష‌లు పొడిగింపు

గువాహ‌టి: అసోం ప్రభుత్వం క‌రోనా నియంత్ర‌ణకు విధించిన ఆంక్ష‌ల‌ను మరోసారి పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వ‌ర‌కు కొవిడ్ నిషేధాజ్ఞల‌ను కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది. అయితే కొన్ని జిల్లాల్లో మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గ‌డంతో ఆంక్షలను సడలించింది. ఈ మేర‌కు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. ఇవి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈనెల‌ 22 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయ‌ని తెలిపింది.

కాగా, రాష్ట్రంలో నిన్న 3678 కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 4,63,175కు చేరాయి. ఇందులో 4,18,472 మంది బాధితులు కోలుకోగా, 40,709 మంది చికిత్స పొందుతున్నారు. మ‌రో 3994 మంది మృతిచెందారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/