జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటున్న తమ్మినేని

ఏపీలో రీసెంట్ గా కొత్త మంత్రివర్గం ఏర్పటు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మంది తో కొత్త వర్గం ఏర్పటు జరుగగా..అందులో 11 మందిని పాతవారినే ఎంపిక చేసారు. కాగా ఈ మంత్రి వర్గ ఏర్పటు ఫై పార్టీ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఛాన్స్ దక్కించుకున్న వారు సంబరాలు చేసుకుంటుంటే..మంత్రి ఛాన్స్ దక్కని వారు..ఆల్రెడీ మంత్రిగా చేసి మరోసారి ఛాన్స్ రానివారు మాత్రం బాధపడుతున్నారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని పలు వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ తమ్మినేని పేర్కొన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదని.. ఎక్కడ ఉండమంటే అక్కడుంటానని అన్నారు. కేబినెట్ కూర్పు అంత సులువేం కాదని.. కేబినెట్ కూర్పు సీఎం విచక్షణాధికారమన్నారు. కేబినెట్లో ఉండాలి అని నన్ను అందరూ అడిగారు.. సీఎం కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. అలాగే కొత్త మంత్రి వర్గ ఏర్పటు ఫై తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అంత చీప్ నా కొడుకులు.అని నేను అనచ్చా… అచ్చెం నాయుడు జరిగినవి సింహావలోకనం చేసుకోవాలని ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెం నాయుడు చూసుకోవాలని చురకలు అంటించారు. యనమల ఎవరు మాకు చెప్పడానికి.. సీఎం జగన్ కి తెలుసు ఏం నిర్ణయించాలో..? కళింగ కమ్యూనిటీ నుంచీ నేను శాసన సభాపతిగా ఉన్నాను.. చాలదా..? మాకు లేని బాధ మీకేమయ్యా..? అని ఎద్దేవా చేశారు.

కేబినెట్‌లో అణగారిన వర్గాలకు సీఎం జగన్‌ గొప్ప అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీసీలకు దామాషా పద్దతిన పెద్ద ఎత్తున రాజాధికారం ఇచ్చారని తెలిపారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని తెలిపారు. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని అన్నారు. కేబినెట్‌లో అందరికీ సమాన న్యాయం జరిగిందని సీతారాం అన్నారు.