జగన్‌కు ఏడో లేఖ రాసిన రఘురామ రాజు

రైతు భరోసా సాయాన్ని అందించాలని డిమాండ్

అమరావతి: సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బుధవారం ఆయన సీఎంకు ఏడో లేఖ రాశారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైస్సార్సీపీకి అండగా నిలిచారని, కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా సాయాన్ని అందించాలని కోరారు. రైతు సాయంగా కేంద్రం అందిస్తున్న రూ. 6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 13,500 కలిపి మొత్తం రూ. 19,500ను అందించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/