మిడతల నివారణకు వేప మందులు పిచికారీ

వేప గింజల ఆధారిత పురుగుమందులు స్ప్రే

locusts

భువనేశ్వర్‌: మిడతలు దండుగా భారత్‌పై దాడి చేస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మిడతల దండు ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు రైతులు తమ పంట పొలాలపై వేప గింజల ఆధారిత పురుగుమందులను స్ప్రే చేయాలని ఒడిశా వ్యవసాయ శాఖ, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు రైతులకు సూచించారు. మిడతల దండు దాడి చేయకుండా రైతులు తమ పంట పొలాలపై వేప గింజల మిశ్రమాన్ని నీటితో కలిపి చల్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరారు. లేదంటే వేప ఆధారిత పురుగుమందులను పొలాల్లో చల్లాలని సలహా ఇచ్చారు. మిడతల దాడి పొంచి ఉన్న నేపథ్యంలో తాము రైతులను అప్రమత్తం చేసి అన్నివిధాలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఒడిశా వ్యవసాయ శాఖ మంత్రి అరుణ్ సాహూ చెప్పారు. 


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/